వేంసూరు,ఫిబ్రవరి 22(జనవిజయం): గ్రామాలలో ఉపాధిహామీ పనులకు కూలీలను సమీకరించాలని ఎంపీడీఓ గడ్డం రమేష్ ఆదేశించారు. బుధవారం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సాధారణ వారాంతపు రివ్యూ సమావేశం నిర్వహించిన గడ్డం సమావేశంలో మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి హామీ ద్వారా జరుగుతున్న పనుల వివరాలు, పనులలో పాల్గొంటున్న కూలీల శాతం అడిగి తెలుసుకున్నారు.కూలీల సంఖ్య పెరిగేలా చూడాలని రమేష్ కోరారు.గ్రామ పంచాయతీలలో జరుగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.అన్ని పనులపై సమీక్ష చేశారు.ఈ సమావేశంలో ఉపాధి హామీ ఏపిఓ బానోతు కోటేశ్వరరావు,ఎంపిఓ భూక్యా రంజిత్ కుమార్,సీనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు సురేష్ రెడ్డి,రాజగోపాల్,పలు గ్రామాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.