టిబి మందులు ఎలా వాడాలో వివరించిన హెల్త్ సూపర్ వైజర్ జయప్రకాష్
- జనవిజయం, 5 మే( గద్వాల్ ): రాజోలి మండలం లో ఉన్న క్షయ వ్యాధి రోగుల ఇళ్ళను టిబి సూపర్ వైజర్ జయప్రకాష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన టిబి రోగులతో మాట్లాడుతూ టిబి మందులను ఎలా వాడుతున్నారు అని వారిని అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సమాధానం రాబట్టారు. వారు ఇచ్చిన సమాధానం తో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ప్రతీ టిబి రోగి క్రమం తప్పకుండా టిబి మందులను వాడాలని అప్పుడే వారు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. మందులను భోజనం చేసిన తరువాత నే టిబి మందులు వేసుకోవాలని అని ఆయన అన్నారు.పరికడుపున, తినకుండా మందులు వేసుకొరాదని వారికి చెప్పారు. మందులతో పాటు పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాష్ చెప్పారు. టిబి వచ్చినంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదని అన్నారు.6నెలల వరకు టిబి మందులను వాడితే క్షయ వ్యాధి పూర్తిగా తగ్గుతుందని ఆయన అన్నారు. పౌష్ఠిక ఆహారం కొరకు ప్రభుత్వం ప్రతి నెల 500రూపాయలు చొప్పున 6నెలల వరకు 3వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆయన వివరించారు.