ఖమ్మం,ఫిభ్రవరి15(జనవిజయం):
బంజారా/లంబాడాల ఆరాధ్య దైవం, సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.నేడు సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని UPH కాలని లో గల సేవలాల్ మహారాజ్ గారు దేవాలయంలో నేటి నుండి నెలాఖరు వరకు జరుగనున్న జయంతి ఉత్సవాలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి వారి జయంతి ఉత్సవాల నిర్వహణ మరో ఉదాహరణగా పేర్కొన్నారు.అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం వారు చేసిన కృషి గొప్పదన్నారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకునే దిశగా సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాంతం పోరాటం సాగించారన్నారు.సేవాలాల్ గారు కల్పించిన చైతన్యం, వారు చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా వున్న లంబాడా/బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందన్నారు.సేవాలాల్ మహారాజ్ గారి గుడి నిర్మాణం చేసి బంజారాలకు అండగా ఉండి ఆదుకుంటున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి సేవాలాల్ రాష్ట్ర నాయకుడు కిషన్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో సేవాలాల్ సేనా రాష్ట్ర అధ్యక్షడు బనోత్ కిషన్ నాయక్, బానోత్ సూర్యం, గుగులోత్ కిషన్, మణికంఠ, రము నాయక్, లక్ష్మీ బాయి, వీరు నాయక్, వినోదా బాయి, మల్సూర్, రాందాస్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.