ఘనంగా సాధన జూనియర్ కాలేజీ -వీడ్కోలు సమావేశం
( మార్చి 10 , జనవిజయం)
జూలూరుపాడు లోని సాధన జూనియర్ కాలేజీ లో ఘనంగా వీడ్కోలు సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా సాధన కళాశాలల అధినేత మరియు ప్రిన్సిపాల్ K. వెంకటేశ్వర్లు హాజరైనారు.వారు మాట్లాడుతూ… ప్రతి ఒక్క విద్యార్థి,కళాశాలలో నేర్పిన క్రమశిక్షణతో జీవితం లో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. వీడ్కోలు అనగా కొంచెం భాద, మరిచిపోలేని స్నేహాలు, ఉపాధ్యాయుల మీద ప్రేమభిమానం ఉంటాయి. కానీ, మీరు భవిష్యత్ లొ ముందు తరగతులకు వెళ్ళాలి కాబట్టి ధైర్యంగా, ముందుడుగు వేయండి అని విద్యార్థులు కు సూచించారు.తదనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
ఈ కార్యక్రమాలలొ కళాశాల ఎకనామిక్స్ లెక్చరర్ కత్తి నర్సింహారావు,కెమిస్ట్రీ లెక్చరర్ అజయ్ కుమార్ , సివిక్స్.. పద్మయ్య, బోటనీ ..నాగేశ్వర్రావు, ఫిజిక్స్.. పణితి రమేష్ బాబు,ఇంగ్లీష్.. రామకృష్ణ, సంస్కృతం.. షకీరా, జూవాలజీ.. లక్హ్మాన్ ,మ్యాథ్స్.. బుచ్చిబాబు,కామర్స్… శిరీష,మ్యాథ్స్.. తేజశ్విని తదితరులు పాల్గొన్నారు.