నూతన వధూవరులను, చిరంజీవులను ఆశ్వీర్వాధాలు,పలు కుటుంబాలకు పరామర్శలు
ముదిగొండ ఫిబ్రవరి 15(జనవిజయం)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు బుధవారం ముదిగొండ మండలం లోని పలు గ్రామాల్లో పర్యటించారు. సువర్ణాపురం గ్రామంలో ఉప సర్పంచ్ తోట ధర్మారావు కుమారుల పంచే కట్టు కార్యక్రమానికి హాజరై చిరంజీవిలను ఆశ్వీర్ధించారు. ఇటీవల వివాహం అయినా ముదిగొండ గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు మందరపు శ్రీనివాసరావు గారి కుమారుడి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయ్యగారి పల్లి గ్రామంలో మరణించిన ఇలవల వెంకట రెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అజ్గర్ గారి తల్లి గారు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు… అదే గ్రామానికి చెందిన పోతురాజు భారతమ్మ గారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంభానికి సానుభూతిని తెలిపారు.వల్లభి గ్రామంలో ఇటీవల మరణించిన బిచ్చాల పెద్ద నరసింహం దశ దిన కర్మ లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన కొండా రాములు చిత్రపటానికి నివాళలర్పించి వారి కుటుంభానికి సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్,మాజీ జెడ్పీటీసీ పసుపులేటి దేవింద్రం,బుల్లెట్ బాబు,ప్రచార కమిటీ చైర్మన్ మట్టా రవీందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు పళ్లపాటి కృష్ణ,జోన్ ఇంచార్జీ మల్లెల అజయ్,జెట్టి వినోద్,చిమసర్తి ఎల్లయ్య,ఏలూరి భాస్కర్, పీల్లోట్ల రాఘవ,మాధవరావు తదితరులు ఉన్నారు.