Friday, June 2, 2023
HomeUncategorizedవచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడోసారి కేసీఆరే సీఎం

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడోసారి కేసీఆరే సీఎం

మూడోసారి కూడా కేసీఆరే సీఎం అవడం ఖాయమని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ,సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
మూడోసారి కేసీఆరే సీఎం

..నామ నాగేశ్వరవు, ఎం.పి..

ఖమ్మానికి ధీటుగా సత్తుపల్లి అభివృద్ధి

..సండ్ర వెంకటవీరయ్య…

సత్తుపల్లి, ఫిబ్రవరి 26(జనవిజయం) : రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే… అందులో ఎటువంటి సందేహం లేదు…మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నామ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జరిగిన సభల్లో నామ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి,సంక్షేమమే బీఆర్ ఎస్ పార్టీకి పట్టం కడతాయని అన్నారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణా లో జరిగిందని అన్నారు.తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. పల్లెలు పట్టణాలలో పోటీపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. 19 గ్రామాలకు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు.ఇది కేసీఆర్ సృష్టించిన ఘన చరిత్ర అన్నారు. ఇప్పుడు దేశం యావత్తు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలిపారురానున్న ఎన్నికలలో అభివృద్ధి కాముకులకే పట్టం కట్టాలన్నారు.రానున్న కాలంలో కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు. ఎన్నికలప్పుడు వచ్చి మాయ, మోసపు మాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అటువంటి వారి ని నమ్మవొద్దన్నారు.పార్లమెంట్ లో తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు నోరు మెదపని వారు ఇప్పుడు ఇక్కడకు వచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో లేని అభివృద్ధి ఒక్క తెలంగాణా లోనే ఉందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ మంచి మెజార్టీ తో గెలుస్తుందని, మరింత అభివృద్ధి చేసుకుందామని నామ తెలిపారు.

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ విజన్ తో సత్తుపల్లి పట్టణాన్ని అన్ని రకాలుగా ఖమ్మం జిల్లా కేంద్రంతో దీటుగా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ఒక్క ఏడాదిలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేసుకోవడం మన అదృష్టమన్నారు.అందరి దీవెనలతో ,సమిష్టి కృషితో సత్తుపల్లి ని మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. గతంలో ఇంత అభివృద్ధి లేదన్నారు. రాబోయే కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కేసీఆర్ , కేటీఆర్ సమర్ధ నాయకత్వం వల్లనే ఇదంతా సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ కుసంపూడి నరసింహారావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కుసంపూడి మహేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, నాయకులు మోరంపూడి ప్రసాద్, దొడ్డా హైమావతి,తోట సుజల రాణి, శంకర్ రావు, వాసు, మరికంటి శ్రీనివాస్, చవ్య మధు, హరి కృష్ణారెడ్డి, చలగల కృష్ణయ్య, అమరవరపు కృష్ణారావు, షేక్ రఫీ, సూరిబాబు, మేకల భవానీ,వనమా వాసు, వేములపల్లి పుష్పలత, నరుకుళ్ల సమత శ్రీనివాస్ , మధు, షేక్ కరీముల్లా,మట్టా ప్రసాద్,అబ్దుల్లా, నాగులమీరా, అప్పారావు,ప్రసాద్, రాణి,షేక్ మోలాలి, తదితరులతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు తదితరులతో పాటు పార్టీ మధిర నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి తాళ్లూరి హరీష్, నామ సేవా సమితి నాయకులు పాల్వoచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments