Friday, June 2, 2023
Homeరాజకీయంమోడీ నుండి దేశాన్ని కాపాడుకుందాం

మోడీ నుండి దేశాన్ని కాపాడుకుందాం

– ఏప్రియల్ 5 న చలో ఢిల్లీ కు రండి
– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి

వేంసూరు,ఫిబ్రవరి24(జనవిజయం): నాడు ఇండియా నుండి బ్రిటిష్ తెల్ల దొరలను వెళ్లగొట్టడానికి భగత్ సింగ్,అల్లూరి సీతారామరాజు లాంటి వీరులెందరో పోరాటాలు,ప్రాణ త్యాగాలు చేసి అందించిన స్వాతంత్ర్య ఫలాలను నేడు పాలిస్తున్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెడుతూ భారతీయుల ఆత్మ గౌరవంపై దెబ్బ కొడుతుందని మోడీ,బిజెపి బారినుండి దేశాన్ని కాపాడుకోవడానికి ఏప్రియల్ 5న సీఐటీయూ,రైతుసంఘం,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం కు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటి సభ్యురాలు మాచర్ల భారతి పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక యర్రా రామయ్య భవనంలో రైతు సంఘం మండల అధ్యక్షులు కొత్తా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సీపీఎం అనుబంధ ప్రజా సంఘాల మండల నేతల సదస్సు,సమావేశంలో పాల్గొన్న భారతి మాట్లాడుతూ దేశ భక్తి యుత పోరాటాలు మార్క్సిజం చూపిన బాటలో సీపీఎం ఎర్ర జెండా చేస్తుందని దేశానికి దిక్సూచి సీపీఎం మాత్రమేనని ప్రజలు గుర్తించాలని ఆమె అన్నారు.అనంతరం పాల్గొన్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణు వర్ధన్ మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కనీస వేతన చట్టంకు,పని గంటల చట్టాలకు,సమ్మె చేసే హక్కుకు భంగం వాటిల్లేలా 46 కేంద్ర కార్మిక చట్టాలలో మార్పులు చేసి లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసి శ్రమ దోపిడీ చేయడానికి మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని అట్టి ఆగడాలకు కార్మికవర్గం ఐక్యమై అడ్డూకట్ట వేయాలని గల్లీ నుండి ఢిల్లీ పోరాటంకు పయనమవాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ భారత దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయ రంగంలో శ్రమిస్తూ దేశానికి అన్నం పెడుతున్నారని రైతులు,వ్యవసాయ కార్మికులు లేని భారత్ ను ఊహించలేమని అన్నారు.పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం రైతాంగానికి కావాల్సిన గిట్టుబాటు ధర,భద్రత ఇ వ్వకుండా కార్పొరేట్ వ్యవసాయం పేరుతో దోచుకోవాలని చూస్తుందని చాప కింద నీరులా నల్ల చట్టాలను తెస్తుందని అక్కడితో ఆగకుండా ఉపాధి హామీ చట్టం కు అరకొర నిధులు కేటాయిస్తూ రోజులో రెండు పూటల పని చేయాలని ఫోటోలు అప్లోడ్ చేయాలని ఆంక్షలు పెడుతూ ఉపాధి హామీ పనులకు వ్యవసాయ కార్మికులను దూరం చేస్తూ చట్టాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని రైతులు,వ్యవసాయ కార్మికులు చలో ఢిల్లీ కార్యక్రమం కు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజలపై పడుతున్న భారాలపై పల్లెలో పాదయాత్రలు చేసి కరపత్రాలు పంచుతూ,సభలు నిర్వహిస్తూ ఏప్రియల్ 5 న ఢిల్లీలో జరిగే దేశ రక్షణ పోరాట వివరాలు తెలపాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులో:- సీఐటీయూ మండల కన్వీనర్ మల్లూరు చంద్రశేఖర్,రైతు సంఘం మండల కార్యదర్శి అర్వపల్లి గోపాలరావు,సీఐటీయూ,రైతు సంఘాల నేతలు రావుల రాజబాబు,డంకర శ్రీను,దానే గౌరీశంకర్, బొందల యాకోబు,రాణి రుద్రమ్మదేవి,బంకా మురళీ,సుధ,శ్రీదేవి,కొప్పుల బాలకృష్ణ,గోళ్ళమూడి లక్ష్మి,పూరేటి సుగునరావు,బాజీ,అర్వపల్లి జగన్మోహన్ రావు, మోరంపుడి వెంకటేశ్వరరావు,ప్రసాద్,ఎండిమందల వెంకటేశ్వరరావు,అర్వపల్లి వెంకటేశ్వరరావు,ఏలిగి నేని రాంబాబు,పుచ్చకాయల వెంకటేశ్వరరావు,గడిపర్తి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments