నిషేధిత సీపీఐ మావోయిస్టు మిలీషియా సభ్యుడు,ముగ్గురు కొరియర్లు అరెస్ట్
జనవిజయం, 06 మే (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): చర్ల శనివారం ఉదయం చర్చ బస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకు చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ పోలీసులు కలిసి సంయుక్తంగా బస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో తనిఖీలు చేసి నిషేదిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన పెద్ద గెల్లూరు ఆర్ పిసి మిలీషియా సభ్యున్ని మరియు మరొక ముగ్గురు కొరియర్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 44-బెలెటిన్ స్టిక్స్ దాదాపు 16 మీటర్ల పొడవు గల వైర్ ను స్వాధీని పర్చుకుని, వారిని అరెస్టు చేయడం జరిగింది.
అరెస్టు కాబడిన నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుడు మరియు కొరియర్ల వివరాలు:1.పద్ధం కళ్ళు, తండ్రి పేరు; లేట్ ఉంగా, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి ట్రాక్టర్ ఓవర్ మరియు డ్రైవర్, గ్రామం: పెద్ద గెల్లూరు, చిన్న గెల్లూరుపంచాయతీ, తరైం పోలీస్ స్టేషన్, బీజాపూర్ జిల్లా, చితిస్టర్ రాష్ట్రం (విషేదిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ కొరియర్2. హెమ్లా, బీమా, తండ్రి పేరు: సుక్కు, వయస్సు: 22 సం, వృత్తి: నిషేదిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ పెద్ద గెల్లూరు ఆర్ పిసి మిలీషియా సభ్యుడు, గ్రామం: పెద్ద గెల్లూరు, చిన్న గెల్లూరు పంచాయతీ, తర్రెం పోలీస్ స్టేషన్, బీజాపూర్ జిల్లా, చాకిన్గడ్ రాష్ట్రం (నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ చెందిన పెద్ద గెల్లూరు ఆర్ మిలీషియా సభ్యుడుకె. మదకం దినేష్ () డ్వాలి, తండ్రి పేరు: లేట్ శ్రీము, వయస్సు 19 సంవృత్తి కూరగాయల వ్యాపారం, నివాసం; లెవిన్ కాలనీ, చర్ల మండలం, 50 పోచమ్మగూడెం గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా (విషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ కొరియర్)4. వారి సోము ఏం లేట్ భద్రయ్య, వయస్సు: 36 సం. వృత్తి తాపీ పని, నివాసం; లెవిన్ కాలనీ, చర్ల మండలం (నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీఅరెస్టు కాబడిన పై మిలీషియా సభ్యులు గత రెండు సంవత్సరాల కాలంగా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన విప్లవ ప్రజా సంఘం ఆర్పేసి పెద్ద గెల్లూరు ఆర్ పీసీ నందు మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నారు.
నిషేధిత సిపిఐ పార్టీ జేగురుగొండ ఏరియా కమిటీకి చెందిన రతన్ అనే సాయుధ దళ సభ్యుడు మరియు నిషేదిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ 9వ ప్లాటూన్ కి చెందిన గంగా అనే సాయుధ దళ సభ్యుడి ఆదేశాల మేరకు వీరు నలుగురు కలిసి పేలుడు పదార్థాలు సేకరించి తిరిగి మావోయిస్ట్ పార్టీ వారికి ఇవ్వడానికి వెళ్తుండగా ఈ రోజు వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 44- జెలెటిన్ స్టిక్స్ మరియు దాదాపు 16 మీటర్ల పొడవు గల వైర్ ను స్వాధీన పర్చుకుని, వారిని అరెస్టు చేయడం జరిగింది.గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజల నమ్మకం ఆదరణ కోల్పోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ, గత కొంతకాలంగా ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ఆదివాసీలను, మైనర్ బాల బాలికలను తెలంగాణ మావోయిస్టు పార్టీ దళ సభ్యులుగా, మిలీషియా సభ్యులుగా చేర్చుకుంటూ, పార్టీ ఉనికి కోసం వారి చేత తెలంగాణ- ఛత్తీస్గర్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో చట్ట వ్యతిరేక పనులు చేయిస్తున్నది. మావోయిస్టు పార్టీ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమాయకపు ఆదివాసీలను, ఆదివాసి మైనర్ పిల్లలను బలవంతంగా పార్టీలో సభ్యులుగా చేర్చుకొని, ఆదివాసి ప్రజలను ఆదివాసీల చేతనే బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు కూడా పాల్పడుతున్నారు. వారికి సహకరించని ఆదివాసులను పోలీసు ఉన్ఫార్మర్ల నెపంతో అతి కిరాతకంగా హత్యలు చేస్తూ, వారి కుటుంబాలను నాశనం చేస్తూ, వారి పిల్లలను అనాథలుగా మారుస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి జీవనం సాగించడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేయడానికి వచ్చే యువకులను, వారి కుటుంబ సభ్యులను మావోయిస్టు పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తూ ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వారిని ఉపయోగించుకుంటున్నారు. వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.నిషేధిత సిపిఐ మావోయి పార్టీకి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము.ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలపై ప్రజలలో ఆదరణ లేకపోవడం వల్ల, ఈ సిద్ధాంతాలు విజయం సాధించలేవనే నిర్ణయానికి వచ్చి, ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకొని అనేకమంది మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు పోలీసు వారి సమక్షంలో లొంగిపోవడం జరుగుతుంది. మావోయిస్టు పార్టీ నుండి బయటికి వచ్చి జనం స్రవంతిలో కలవాలనుకునేవారు స్వచ్చంధంగా లేదా బంధుమిత్రుల ద్వారా గానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో గాని లేదా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వద్దకు కానీ వచ్చి సంప్రదించగలనని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసువారి తరపున మనవి చేస్తున్నాము.