◆ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
◆ ఆందోళన అవసరమే లేదు
◆ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ
ఖమ్మం, ఫిబ్రవరి15(జనవిజయం) : జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని, ఆ మాటను నిలబెట్టుకుంటానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టంచేశారు. చిన్న, మధ్యతరహా పత్రికలు, కేబుల్ చానళ్ళకు చెందిన జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సారథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను బుధవారం కలసి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులల్లో సగం మందికి పైగా రెవెన్యూ సర్వే జరిగిందని, మిగిలిన చిన్న, మధ్యతరహా పత్రికలు, కేబుల్ చానల్స్, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డెస్క్ జర్నలిస్టులు ఖమ్మంలో విధులు నిర్వహిస్తూ, జిల్లా కేంద్రంలోనే నివాసం ఉంటున్నందున వారికి ఇళ్ల స్థలాలు ఖమ్మంలోనే వర్తింపజేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కోరారు. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందిస్తూ.. ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీకిచ్చిన మాటను నిలుపుకుంటానని, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని పటిష్టంగా అమలు పరుస్తానని మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు, డిపిఆర్ఓ కు తెలియజేసి సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ… జర్నలిస్టులు సంయమనం పాటించాలని, ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంత్రి ఇచ్చిన హామీని నిలుపుకుంటారన్న విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉందని అన్నారు. ఖమ్మం నిండు బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు జరుగుతుందని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు(ఐజేయు) వెన్నెబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు పిన్నెల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు జానీపాషా, కొత్తా యాకేష్, తిరుపతిరావు, ప్రెస్ క్లబ్ కోశాధికారి బిక్కీ గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరావు, సహాయ కార్యదర్శి జీవన్ రెడ్డి, మహిళా ప్రతినిధి వంగూరి ఈశ్వరి, నాయకులు వనం నాగయ్య, జక్కుల వెంకటరమణ, ఉత్కంఠం శ్రీనివాస్, యాదగిరి, సంతోష్, మోహన్, వెంకటకృష్ణ, పురుషోత్తం, శ్రీనివాస్, వేణుగోపాల్, బండి కుమార్, గెంటెల కుమార్, కాశీం, ప్రభాకర్ రెడ్డి, పి పానకాలరావు, పురుషోత్తం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.