Friday, June 2, 2023
HomeUncategorizedమాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ నియమాకం

మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ నియమాకం

కొరిపల్లి మాట్లాడుతూ.,ఏబిసిడి వర్గీకరణ  తక్షణమే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 

మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ నియమాకం
  ఖమ్మం, మార్చి 04( జనవిజయం):ఖమ్మం జిల్లా కేంద్రంలో మాదిగ హక్కుల దండోరా (ఎం హెచ్ డి) ఎస్సార్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో మూడవ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఆ సభలో వ్యవస్థాపక అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ జాతీయ అధ్యక్షులు, దండు సురేంద్ర మాదిగ, ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్ర కమిటీని ఎన్నిక చేశారు .
     ఖమ్మం పట్టణ వాస్తవ్యులు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగను మాదిగ హక్కుల దండోరా ఎం హెచ్ డి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు . కొరిపల్లి మాట్లాడుతూ.,ఏబిసిడి వర్గీకరణ  తక్షణమే చేయాలని,  మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,ఎస్సీ లోన 59 ఉప ఉప కులాలకు దళిత బంధు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని , ప్రభుత్వం సంబంధించిన లిడ్ క్యాప్ భూములను కాపాడాలని, నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు . మాదిగ హక్కుల దండోరా మాదిగ హక్కుల సాధన కోసం నిరంతరం పనిచేస్తుందని మాదిగలకు మాదిగ ఉపకులాలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలో మాదిగ హక్కుల దండోరా సంఘాన్ని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ పదవి నా పై నమ్మకంతో  నియమించిన వ్యవస్థాపక అధ్యక్షులు యాతకులు భాస్కర్ మాదిగ మరియు  జాతీయ అధ్యక్షులు దండు సురేంద్ర మాదిగా కి ప్రత్యేక కృతజ్ఞతలు  తెలియజేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments