గిరిజన పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత
హైదరాబాద్, ఏప్రిల్ 24(జనవిజయం): తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, ట్రైకార్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి గిరిజన పారిశ్రామికవేత్తల ప్రోత్సాహ పథకంలో పరిపూర్ణత సాధించిన గిరిజన యువతకు మంత్రి కె.టి.అర్ పారిశ్రామిక యూనిట్లను ఏప్రిల్ 24 న బంజారా భవన్, హైదరాబాదులో అందజేసినారు.
ముఖ్యమంత్రి గిరిజన పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక పథకం లో పారిశ్రామిక యూనిట్లను అందుకున్న వారిలో ఏజెన్సీ ప్రాంత వాసి భధ్రాద్రి-కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలో ఆటోమొబైల్ యూనిట్ ను స్థాపించుటకు మొదటి గిరిజన పారిశ్రామికవేత్తగా కొర్స చోడేశ్వర్ ఉన్నారు. జె.ఎన్.టి.యు,హైదరాబాదు లో మెకానికల్ ఇంజనీరింగు మరియు బి.టి.యచ్. యూనివర్సిటీ, స్వీడన్ లో యం.యస్ చేసి గిరిజనుల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిపించాలని గిరిజన పారిశ్రామిక వేత్తగా కొర్స చోడేశ్వర్ అడుగులు వేస్తున్నారు.