భూ అక్రమాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు
40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో ఎటువంటి అన్యాయాలకు అక్రమాలకు పాల్పడలేదు
మావోయిస్టు పార్టీ నాయకులు పేరుతో వెలువడిన లేఖ నన్ను ఆశ్చర్య పరిచింది.
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి ప్రజల కోసమే నిస్వార్ధంగా సేవ చేశాను
కొడాలి శ్రీనివాసన్, సీనియర్ టి.డి.పి లీడర్
భద్రాచలం,మార్చి 07(జనవిజయం):
భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు నాయకులు పేరు తో వెలువడిన ఓ ఉత్తరం సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడం భద్రాచలం ఏజెన్సీ వాసులను దిగ్భ్రాంతి కి గురిచేస్తోంది. ఆ లేఖలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు ను ఉదహరిస్తూ ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆ లేఖ నిజంగానే మావోయిస్టులు విడుదల చేసారా..లేక ఫేక్ ఉత్తరమా అని ఇంత వరకు ఎవరు కూడా నిర్ధారించలేదు.
ఈ నేపధ్యంలో సీనియర్ న్యాయవాది కొడాలి శ్రీనివాసన్ జన విజయం ప్రతినిధి తో మాట్లాడుతూ., ఆ లేఖ మావోయిస్టులు విడుదల చేసిందా..లేదా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని, అయినప్పటికీ ఆ లేఖ తనను కలచి వేసిందని తెలిపారు.తెలుగుదేశం పార్టీ ప్రారంభించి అంచెలంచెలుగా పార్టీ కోసం ఏజెన్సీలోని పేద ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నిస్వార్ధంగా సేవ చేశానని 45 ఏళ్ల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఏనాడు కూడా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడలేదని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా పార్టీ కార్యక్రమాలతో పాటు న్యాయవాదిగా జీవనం సాగిస్తూ అనేకమంది పేద ప్రజలకు న్యాయ సహాయం ఉచితంగా చేశానని నా మీద ఇటువంటి ఆరోపణలు చేయటం బాధ కలిగించాయని కొడాలి శ్రీనివాసన్ అన్నారు.అక్రమాలను ఎప్పుడు ప్రోత్సాహం కూడా చేయలేదని ఇటువంటి ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.