Friday, June 2, 2023
Homeరాజకీయంచత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో భారీ ర్యాలీ, శోభాయాత్ర

చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో భారీ ర్యాలీ, శోభాయాత్ర

ఖమ్మం,ఫిబ్రవరి19(జనవిజయం): హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ 393 జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని, ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఆదివారం సాయంత్రం హిందూ ఏక్తా బైక్‌ర్యాలీ, శోభాయాత్ర విజయవంతంగా కొనసాగింది. నగరంలోని పెవిలియన్ మైదానం నుండి నుంచి జిల్లా పరిషత్ చౌరస్తా వరకు భారీ బైక్‌ర్యాలీ, శోభాయత్ర నిర్వహించారు. ఈ సందర్భగా ప్రదాన వక్త సామాజిక సమర సతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మట్లాడుతూ, ముస్లిం రాజుల పరిపాలనలో హిందువుల పట్ల నిరంకుశంగా మత మార్పిడి కొనసాగుతున్న సందర్భంగా హిందూ సామ్రాజ్య విస్తరణపై ఛత్రపతి శివాజీ చూపిన చొరవతో నేడు మన దేశం హిందూ దేశంగా కొనసాగుతుందన్నారు. తన తల్లి జిజియా బాయి స్ఫూర్తితో హిందువుల ఐక్యత, విస్తరణ కోసం భీకర మైన యుద్ధాలు చేసి ముస్లిం రాజుల నుంచి హిందు వులను కాపాడిన ఘనత శివాజీదే అన్నారు. హిందువులు శాంతి కాముకులని, శాంతి, సహనంతో ఉండటంతోనే పరా యి దేశస్థులు పెట్రేగిపోతున్నారని అన్నారు. పాకిస్థాన్‌, చైనా లాంటి దేశాలను ఉపేక్షిస్తే మన దేశానికే ప్రమాదమన్నారు. ఈమధ్య భూకంపం వచ్చిన దేశాలలో కొన్ని ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నప్పటికిని భారతదేశం తన యొక్క విశాల హృదయంతో టర్కీ లాంటి దేశాలకు ఎంతో విలువైనటువంటి సహాయ సహకారాలను అందించి ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడిందని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంచలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి దేశ పౌరు లందరూ మద్దతు ఇవ్వాలని అన్నారు. ప్రతి పౌరుడు ముం దుగా దేశ భద్రతకు పాటు పడుతూ దేశ హితం కోసం ముందు కెళ్లాలన్నారు. యువత చెడు మార్గంలో కాకుండా హిందూ సమాజ ఉద్దరణ కోసం పాటుపడుతూ, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా ప్రచారక్ పి వి చంద్ర శేఖర్, జిల్లా సంయోజక్ సందీప్, హిందూ వాహిని కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, బిజెపి నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments