Friday, June 2, 2023
Homeరాజకీయం27న ఖమ్మంలో సిపిఎం జిల్లా ప్లీనం

27న ఖమ్మంలో సిపిఎం జిల్లా ప్లీనం

-సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు

ఖమ్మం,ఫిభ్రవరి25(జనవిజయం): సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం (ప్లీనం) ఈనెల 27న ఉదయం 10 గంటలకు ఖమ్మం నగరంలోని యన్.ఎస్.పి.క్యాంప్ లో గల మంచికంటి హల్ నందు జరుగుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు,మండల కమిటీ సభ్యులు,శాఖ కార్యదర్శులు,జిల్లా ప్రజా సంఘాల ప్రాక్షన్ కమిటీ సభ్యులు,హోల్ టైమర్స్, జిల్లా సెంటర్ శాఖా కార్యదర్శులు హాజరు అవుతారని తెలియజేశారు.ప్లీనం లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్ రావులు పాల్గొంటారని తెలిపారు.ప్లీనరీ సమావేశంలో ప్రధానంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సిపిఎం వైఖరి – పార్టీ నిర్ణయాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివరిస్తారని తెలిపారు.ఆహ్వనితులందరూ సమయానికి హాజరు కావాల్సిందిగా నున్నా కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments