కాంట్రాక్ట్ అధ్యాపకుల మెడికల్ బదిలీలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి!
..యస్.యఫ్.ఐ, డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీల అధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి కి విన్నతి..
జనవిజయం ,ఏప్రిల్ 21(ఖమ్మం):ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుల మెడికల్ బదిలీలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని,బదిలీల వల్ల డిస్టఫ్ అయిన గెస్ట్ అధ్యాపకులను కొనసాగించి,జూన్ లోనే వారికి రేన్యూవల్ ఆర్థర్ ఇవ్వాలని,విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని యస్.యఫ్.ఐ, డి.వై.యఫ్.ఐ రాష్ట్ర నాయకులు రజినీకాంత్,శ్రీకాంత్, ఎండి.జావేద్ లు డిమాండ్ చేశారు.
స్థానిక హైదరాబాద్ లోని విద్యాశాఖ మంత్రి గారి నివాసంలో యస్.యఫ్.ఐ,డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీల అధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ మెడికల్ బదిలీలలో ఇష్టానుసారంగా కొన్ని అవకతవకలు జరిగాయని,ఫలితంగా అనేక కళాశాలలో వచ్చే విద్యాసంత్సరం నాటికి విధ్యార్థులకు క్లాసులు చెప్పడానికి లెక్చరర్స్ కొరత ఏర్పడుతుందని,ఉదాహరణకు ములుగు జిల్లా వాజేడు జూనియర్ కళాశాలలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరు బదిలీ అయ్యారని మరి వచ్చే విద్యాసంవత్సరానికి విధ్యార్థులకు క్లాసులు ఎవరూ చెప్తారని,ఎవరినీ చూసి విద్యార్దులు కళాశాలలో చేరుతారని వారు ప్రశ్నించారు.ఫలితంగా కలశాల మూతబడి పరిస్థితికి వస్తుందని,ఇంకా చాలా కళాశాలలో ఈ పరిస్థితి ఉందనీ, భవిష్యత్ లో పేద,గిరిజన,ఆదివాసీ విద్యను దూరం చేసినట్లు అవుతుందని వారు తెలిపారు.వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్స్ మెడికల్ బదిలీలలో జరిగిన అవకతవకలపై సమగ్రమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.అలాగే ఈ బదిలీల వల్ల చాలా కాలేజీలలో ఎప్పటినుండో పనిచేస్తున్న అతిధి అధ్యాపకులు డిస్టఫ్ అయ్యారని వారిని యధావిధిగా కొనసాగించాలని,విద్య సంవత్సరం ప్రారంభంలోనే వారికి రెన్యువల్ చేయాలని వారు కోరారు.విద్య సంవత్సరం ముగిసిపోతున్న ఇంతవరకు గత,ప్రస్తుత పెండింగ్ స్కాలర్ షిప్స్,రియాంబర్స్ మెంట్,హాస్టల్స్ మెస్ చార్జీలు పెండింగ్ లో ఉన్నాయని,వెంటనే వాటిని విడుదల చేయాలని,వి పత్రంలో పేర్కొన డిమాండ్స్ అన్ని విద్యాశాఖ మంత్రి గారు స్పందించి వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.