రిజిస్ట్రార్ ఆఫీస్ లో ‘డాక్టర్ కేర్’ ఉచిత హోమియోపతి వైద్య శిభిరం.
- ఖమ్మం, ఫిబ్రవరి 27.,(జనవిజయం):సోమవారం ఖమ్మం రిజిస్ట్రార్ ఆఫీస్ లో ‘డాక్టర్ కేర్ పోసిటివ్ హోమియోపతి’ ఆధ్వర్యంలో కార్యాలయం విసిటర్స్ కి, సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని డిక్ట్రిక్ట్ రెజిస్ట్రేట్ రవి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కేర్ వైద్యులు వై వీణశ్రీ బిపి, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించి అక్యూట్, క్రానికల్ రుగ్మతులకు హోమియోపతి వైద్యం ఎలా పనిచేస్తుందో వివరిస్తూ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ హోమియోపతి వైద్యం ప్రాముఖ్యతను ప్రజల్లో కి తీసుకువెళ్తున్నందుకు ‘డాక్టర్ కేర్’ సంస్థ సిఈఓ డాక్టర్ ఏఎం రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ విజయ జ్యోతి మాట్లాడుతూ మున్ముందు ఇలాంటి క్యాంపులు మరెన్నో నిర్వహించి, సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి వైద్యం పట్ల మరింత అవగాహనను కల్పించాలన్నారు.
- ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ ఖమ్మం బ్రాంచ్ పిఆర్ఓ వి స్వాతి, ఫార్మాసిస్ట్ మౌనిక, రిజిస్ట్రార్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.