Friday, June 2, 2023
HomeUncategorizedకేంద్రంపై సీఎం కేసీఆర్‌ది ధర్మపోరాటం... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..

కేంద్రంపై సీఎం కేసీఆర్‌ది ధర్మపోరాటం… సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..

బిజెపి ఓటమి పై సిపిఐ(ఎం) పార్టీ , బిఆర్ఎస్ కు మద్దతు.

 

బీజేపీని చిత్తుగా ఓడించాలి!

వరంగల్ టూ చర్ల కు చేరిన సిపిఐ (ఎం) జనచైతన్యయాత్ర

కేంద్రంపై సీఎం కేసీఆర్‌ది ధర్మపోరాటం

 బిజెపి ఓటమి పై సిపిఐ(ఎం) పార్టీ , బిఆర్ఎస్ కు మద్దతు.

… సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..

చర్ల ,మార్చ్ 19(జనవిజయం)

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చేరుకున్నది. సుబ్బంపేట నుండి కొయ్యూరు ,కత్తిగూడెం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి చర్ల బస్టాండ్ ఆవరణంలో నిర్వహించిన బహిరంగ సభకు చేరుకుంది. ఆదివారం చెర్ల మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నందు కార్యదర్శి కారం నరేష్ అధ్యక్షతన జరిగిన జన చైతన్య యాత్ర భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బిజెపి అరాచకాలను ఎండగట్టారు .

         తమ్మినేని వీరభద్రం. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు ,సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రమ్మచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినట్టు తెలిపారు.జనచైతన్య యాత్ర సభ లో సిపిఐ(ఎం) పార్టీ చర్ల మండలం లో చేసిన పోరాటాలను వివరిస్తూ అనేక సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలు చేసామని ,అలాగే చర్ల మండలం లో కోరేగడ్డ భూనిర్వాసితులకు,పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎన్నో సేవలు అందించామని పోడుభూమిసమస్యల పై వలస వచ్చిన గిరుజనులకు కుల ధృవీకరణ పాత్రలను అమలు చేయాలనీ మండల కేంద్రంలో వున్న అనేక సమస్యల పై పోరాటాలు చేసామని రాబోయే కాలంలో ఎర్రజెండాను గెలిపించాలని ప్రజలకు తెలియజేసారు. .
ప్రధాని నరేంద్రమోదీ దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. 2022 నాటికి దేశంలో ఇండ్లులేని పేదలుండరని చెప్పిన బీజేపీ ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదన్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎవరైనా బీజేపీ పాలనను వ్యతిరేకిస్తే అక్కడి ముఖ్యమంత్రి, మంత్రులపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మోదీ దగ్గరి మిత్రుడు గౌతం అదానీ ఎల్‌ఐసీ, ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఎగ్గొట్టి రూ.17 వేల కోట్లకు ఆస్థిపరుడైతే అతడిపై ఎందుకు కేసులు పెట్టలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ పేద ప్రజలను అణగదొక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ హయాంలో దేశంలో మహిళలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో ఆడవాళ్లను అగౌరవ పరుస్తూ, ఇంట్లో వస్తువులతో పోలుస్తూ బీజేపీ సభ్యులు పార్లమెంట్‌లో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పట్ల ధర్మపోరాటం చేస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోదీని గద్దెదించే దాకా సీపీఎం, సీపీఐలు సీఎం కేసీఆర్‌ వెంటే ఉంటాయని ప్రకటించారు. బీజేపీపై సీఎం కేసీఆర్‌ చేస్తున్న పోరాటంలో సీఎం కేసీఆర్‌కు బాసటగా నిలుస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

      ఈ కార్యక్రమంలో పోతినేని సుదర్శన్, మచ్చా వెంకటేశ్వర్లు, జన చైతన్య యాత్ర వాహనాల నిర్వాహక ఇన్చార్జి కే. పుల్లయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య జిల్లా కమిటీ సభ్యులు బ్రహ్మచారి ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ , సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చిమలమర్రి మురళీకృష్ణ, ఉపసర్పంచ్ శివ లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు దొడ్డి హరినాగ వర్మ ,పొడుపు గంటి సమ్మక్క, మచ్చ రామారావు, బందెల చంటి, సరోని, సిఐటి నాయకులు బాలాజీ, విజయ్ శీల, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బుక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments