బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం
భద్రాచలం, మార్చి 11 (జనవిజయం)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం సాయంత్రం భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అరికిల్ల తిరుపతిరావు మాట్లాడుతూ., ఎం ఎల్ సి కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలును తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.బండి సంజయ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ దిష్టి బొమ్మను బిఆర్ఎస్ పార్టీ దహనం చేసింది.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొండిచెట్టి కృష్ణమూర్తి , మహిళా మండల ప్రధాన కార్యదర్శి ములకలపల్లి మదారి, గ్రంథాలయం చైర్మన్ మామిడి పుల్లారావు, విద్యార్థి డివిజన్ నాయకులు ఎండి బషీర్, సీనియర్ నాయకులు తాళ్ల రవికుమార్, కోటగిరి ప్రమోద్ కుమార్ , చాట్ల రవికుమార్, ఎల్వి, ఒకటో వార్డు అధ్యక్షులు మామిళ్ళ రాంబాబు, 11వ వార్డు అధ్యక్షులు ఒగ్గు రమణ, ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు చారి, మాజీ మహిళా మండల అధ్యక్షులు ఎండి ముంతాజ్ , ఈర్ల భారతి, మాదాసు సాయి కుమారి, మైనార్టీ ప్రధాన కార్యదర్శి మైదులి బేబీ, జాగృతి అధ్యక్షురాలు పద్మప్రియ , ఉగ్గు అనురాధ, సత్యవేణి ,మాజీ కనకదుర్గమ్మ చైర్మన్ సీతామహాలక్ష్మి ,రమాదేవి, లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగినది