భద్రాచలం ఎం.ఎల్.ఏ వీరయ్యను కలసిన బ్రాహ్మణ ప్రతినిధులు
దేవస్థానంలో ఆస్థాన పురోహితుని పోస్టు ను వెంటనే భర్తీ చేయమని డిమాండ్!
అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న ఎం.ఎల్.ఏ.
భద్రాచలం, ఫిబ్రవరి 28( జనవిజయం) : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అత్యంత ప్రధానమైన ఆస్థాన పురోహితుని పోస్టు గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.భారత దేశం లో దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల దేవస్థానంలో ఆస్థాన పురోహితుడ్ని నియమించడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష వైఖరి అవలంభిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. ఆస్థాన పురోహితుడ్ని వెంటనే భర్తీ చేయమని దేవాదాయ శాఖ కమిషనర్ కి గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం విన్నవించుకుంది.అయినప్పటికీ అధికారులనుండి ఆశించినంత స్పందన లేకపోవడం వలన రామా వజ్జల రవికుమార్ శర్మ రాష్ట్ర అధ్యక్షులు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం మరియు స్థానిక బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య ని కలసి ఆస్థాన పురోహితుడి ప్రాధాన్యత ను వివరించి.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా అభ్యర్ధించారు. ఎందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ విషయంలో తప్పకుండా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.