మోటార్ సైకిల్ ల దొంగ ను అరెస్ట్ చేసిన భద్రాచలం పోలీసులు
రెండు మోటార్ ల సైకిల్ రికవరీ.
జనవిజయం, 06 మే(భద్రాచలం)
ఏఎస్పీ పరితోస్ పంకజ్, ఆదేశాల మేరకు, భద్రాచలం పట్టణంలో మోటర్ సైకిల్ ల దొంగతనాలు చేస్తున్నాడని పక్కా సమాచారంతో భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేయగా భద్రాచలం పట్టణానికి చెందిన కొండపల్లి శంకర్ ను భద్రాచలం పోలీస్ లు సీసీ కెమెరాల సహాయంతో పసిగట్టి చాకచక్యంగా పట్టుకొని తనదైన శైలి లో విచారించగా, మాస్టర్ తాళపు చేవి సహాయం తో భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ మరియు ముత్తూట్ ఫైనాన్స్ ముందు నిలిపి ఉంచిన మరొక మోటార్ సైకిల్ ను కూడా దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు. మోటార్ సైకిల్ కి సంబంధించినటువంటి ఎటువంటి పత్రాలు లేకుండా తాకట్టు పెట్టుకున్న సారపాకకు చెందిన గంట నరసింహారావు ను కూడా అదుపులోనికి తీసుకొని విచారించి అరెస్టు చేయడం జరిగింది.
భద్రాచలం పట్టణం మరియు పరిసర ప్రాంతాల లోని కొంతమంది వడ్డీ వ్యాపారులు ఎటువంటి ఒరిజినల్ పత్రాలు లేని, మోటర్ సైకిల్ లను ఓనర్ లను విచారించకుండా తనఖా పెట్టుకుని అప్పులు ఇస్తున్నట్లుగా పోలీసు దృష్టికి వచ్చింది. ఈ విధంగా ఎవరైనా నేరస్తులకు సహకరించినట్లయితే వారిని కూడా దొంగతనం కేసులలో అరెస్టు చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతున్న దొంగను చాకచక్యంగా అరెస్టు చేసిన భద్రాచలం పోలీసులను ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి ఎస్ఐలు శ్రీకాంత్ & మధు ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు..