సురక్షిత నివాసం కోసం 245 రోజులుగా సుదీర్ఘ నిరసన దీక్ష..పాములు..తేళ్ల తో…వర్షపు నీళ్లల్లో దుర్భర జీవనం
భద్రాచలం, మార్చి 19( జనవిజయం)
గోదావరి ముంపు బాధితులు, ఇండ్లు లేని నిరుపేద ఆదివాసీలు మరియు దళిత కుటుంబాలు సుమారు 600 కుటుంబాలు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన తడిసి ముద్దయి..తేళ్ళ పాములతో జీవనం కొనసాగిస్తున్నారు.
కృష్ణసాగర్ గ్రామ పంచాయితీ పరిధిలో మణుగూరు ప్రధాన రహదారి ప్రక్కన తాత్కాలిక నివాసాలు వేసుకొని 245 రోజులుగా సురక్షిత ప్రాంతాలలో నివాసాల కోసం నిరవధిక నిరసన దీక్ష చేస్తున్నారు.ఈ సుదీర్ఘ పోరాటానికి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ నిరుపేదలకు ఓ సురక్షిత గూడు దొరుకుతుందని ఆశిద్దాం.