సిఆర్పిఎఫ్ 141బేటాలియన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు.
యువతకు క్రీడా సామాగ్రి అందించిన చర్ల పోలీస్ శాఖ
చర్ల, మార్చ్ 25(జనవిజయం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, కుదునూరు గ్రామ పంచాయతీ పరిధిలోనీ వీరాపురం గ్రామం లో సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా,141బేటాలియన్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది,వీరాపురం గ్రామంలో వున్నా గిరిజనులకు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా 85 మందికి సిఆర్పిఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ దర్, డాక్టర్ కల్పన సిఆర్పిఎఫ్, మరియు చర్ల పిహెచ్సి డాక్టర్ పెద్దాడ జి ఎన్ కాంత్ సమక్షంలో వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కామండెంట్ అరుణ్ కుమార్, సి ఐ అశోక్ బి (చర్ల పి ఎస్ ), ఎస్ ఐ వెంకటప్పయ్య పాల్గొన్నారు. క్రీడాకారులపై ఆసక్తి కలిగి ఉండాలని విరాపురం గ్రామంలో ఉన్న యువతకు వాలీబాల్, ఫుట్బాల్, మరియు పిల్లలకు క్యారెమ్ బోర్డ్, చెస్ బోర్డ్ లు అందచేయడం జరిగింది.