పెద్దబీరవల్లి లో గొర్రెలు మేకలకు ఉచిత నట్టాల నివారణ కార్యక్రమం
బోనకల్, ఫిబ్రవరి 27, (జనవిజయం):మండల పరిధిలోని పెద్దబీరవల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టాల కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది op. గ్రామంలో గల 2390 గొర్రెలకు 298 మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు త్రాగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ కె.గోపాల్ రావు,వెటర్నర్ అసిస్టెంట్స్ నాగేంద్ర కుమార్, చిన్నయ్య,గ్రామ గోపాల్ మిత్రులు బొల్లేపోగు వాసు, వీరయ్య,నాగులు మీరా,పశుమిత్ర త్రివేణిలు పాల్గొన్నారు.