Tuesday, February 20, 2024
HomeUncategorizedపల్లెలో ప్రజాగర్జన యాత్రలు చేస్తాం

పల్లెలో ప్రజాగర్జన యాత్రలు చేస్తాం

మల్లూరు చంద్రశేఖర్ (సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు)

 

పల్లెలో ప్రజాగర్జన యాత్రలు చేస్తాం!

మల్లూరు చంద్రశేఖర్ (సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు)

వేంసూరు,ఫిబ్రవరి,27(జన విజయం):- మండల పరిధిలోని పలు పల్లెల్లో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాగర్జన పాదయాత్రలు చేసి ప్రజలను చైతన్య పరుస్తామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు,సీపీఎం మండల నేత మల్లూరు చంద్రశేఖర్ అన్నారు.సోమవారం ఖమ్మం నగరంలోని మంచికంటి మీటింగ్ హల్ నందు జరిగిన సీపీఎం పార్టీ జిల్లా విస్తృత ప్లీనం సమావేశంలో పాల్గొన్న మల్లూరు మాట్లాడుతూ మార్చి 21 న నియోజకవర్గ పరిధిలోని తల్లాడ పట్టణంకు రానున్న ప్రజాగర్జన రాష్ట్ర జాతా సభకు అధిక సంఖ్యలో ప్రజలను తరలిస్తామని,ఏప్రియల్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమం కు కార్మికులను,రైతులను,వ్యవసాయ కూలీలను తరలిస్తామని దేశాన్ని కాపాడటానికి జరిగే పోరాటంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో: సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్,రాష్ట్ర కమిటి సభ్యురాలు మాచర్ల భారతి,జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు,పొన్నం వెంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారని తనతో పాటు మండల సీపీఎం కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావు,దొడ్డే సత్యనారాయణ,మండల ఇంచార్జి చలమాల విఠల్ రావు లు పాల్గొన్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments