అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి!
… ప్రజాపంథా సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్..
. ఖమ్మం, మార్చి 19(జనవిజయం).
గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు, మండల వ్యాప్తంగా వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిరప ,వరి, మొక్కజొన్న,మామిడి పంటలు వేసిన రైతులు బాగా నష్టపోయారని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక కామేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రజాపంథా మండల కార్యదర్శి ఎన్ వి రాకేష్ పాల్గొని మాట్లాడుతూ.,ఆరు గాలం కష్టపడి లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే, పంటలు పండి చేతికి వచ్చే సమయాన కురిసిన అకాల వర్షాల వలన రైతులు కోలుకోని విధంగా నష్టపోయారు. పంటల కోసం తెచ్చిన అప్పులకు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాపంథా మండల నాయకులు చల్లా రాజు, అజ్మీర కిషన్, రాంబాబు, యాకోబు తదితరులు పాల్గొన్నారు.