ABOUT US


పల్లెప్రపంచం సర్వీసెస్ అనేది Indian partnership act 1932 ప్రకారం ఏర్పాటైన భాగస్వామ్య సంస్థ. Regd No : 123/2018 (khammam). చిరునామా: 2‌-22/2, చొప్పకట్లపాలెం, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. website : www.palleprapancham.in, mail id: palleprapancham@gmail.com

క్రింది 6 అంశాలు విజన్ గా పెట్టుకుని పని చేస్తున్నాము.


ఉత్పాదక, మార్కెటింగ్ రంగాల ద్వారా ఉపాధి కల్పన : సంస్థ తరపున ఉత్పత్తి చేసే వస్తువులను మరియు ఇతర తయారీదారుల ప్రొడక్టులను అధీకృత మార్కెటింగ్ చేయడం ద్వారా ఉపాధి కల్పనకు ప్రయత్నం చేస్తుంది. ఇందుకు గాను డైరెక్టు సెల్లింగ్ (నెట్ వర్క్ మార్కెటింగ్) విధానంను అనుసరించడం జరుగుతుంది.

ముద్రణ, అంతర్జాల పత్రికల ద్వారా సామాజిక చైతన్యం : సంస్థ తరపున ముద్రణ మరియు అంతర్జాల పత్రికలను నిర్వహించడం జరుగుతుంది. వీటి ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయడంతో పాటు పత్రిక రంగంలో ఉపాధి కల్పనకు కూడా కృషి చేయడం జరుగుతుంది. మెరుగైన జర్నలిజం కోసం మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. జర్నలిస్టులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుంది.

మనో, వైజ్ఞానిక, తాత్త్విక శిక్షణల ద్వారా వ్యక్తి చైతన్యం : ప్రతి మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తులను వెలికి తీయడం ద్వారా వ్యక్తి చైతన్యం పెంచేందుకు కృషి చేయడం జరుగుతుంది. వివిధ అంశాలపై నిపుణులతో శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుంది.

ఇంటింటా గ్రంధాలయాలతో అధ్యయనం పెంపొందించడం : పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. మనం ఏం చేస్తున్నామో చూసి చాలా వరకు అలవాట్లుగా మార్చుకుంటారు పిల్లలు. మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం అంటారు. మానసిక చైతన్యం, వికాసం కోసం పుస్తక పఠనం తోడ్పాటునందిస్తోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ పుస్తకం ప్రాధాన్యత కోల్పోలేదనే చెప్పాలి. ప్రతి ఇంట్లో మంచి పుస్తకాలుంచడం అలవాటుగా మార్చితే పిల్లలకు మంచి వికాసం ఏర్పడడానికి దోహదం చేసినవారమవుతాం. దీనికి మావంతు సహకారంగా ఇంటింటా గ్రంధాలయాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము.

మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు క‌ృషి : వృక్షో రక్షతి రక్షిత: అన్నది మన భారతీయ ధర్మంగా చెప్పబడుతోంది. భారతీయులకే కాదు ప్రతి మనిషికీ ప్రకృతి, పర్యావరణం మిత్రులే. వాటిని కాపాడుకోవలసిన ధర్మం మనపై ఉన్నది. చెట్లవలన మనకు అనేక ఇతర ప్రయోజనాలు ఉన్న సంగతి విదితమే. అన్నీ తెలిసినా మనిషి అజ్ఞానంతో చెట్లను సంరక్షించుకోవడంలో వెనుకబడుతుండడం క్షమించరాని విషయం. ప్రతి ఒక్కరి చేత చెట్లను నాటించడం ఒక సంస్కృతిగా నేర్పిద్దాం. ఎక్కడ ఖాళీ చోటు ఉన్నా ప్రయోజనకరమైన మొక్కలు నాటుదాం. ప్రతి ఫంక్షన్ కు గుర్తుగా చెట్లను నాటే మంచి సంప్రదాయాలను పెంపొందింప జేద్దాం. పల్లెప్రపంచం ద్వారా నర్సరీలను పెంచడంతోపాటు మొక్కలను విరివిగా నాటింపజేయడం, ప్రచారం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుంది.

ప్రకృతి జీవన విధానం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధన : జాగ్రత్తగా గమనిస్తే మనిషికి రెండే రెండు సంబంధాలున్నట్లు తెలుస్థాయి. అవి 1) ప్రకృతితో సంబంధం 2) సాటి మనుషులతోటి సంబంధం. మనిషి ప్రక్రుతికి దగ్గరగా, ప్రక్రుతిని సంరక్షించేలా తన జీవన విధానంను అలవాట్లను మార్చుకునేలా పల్లెప్రపంచం కృషి చేస్తుంది.


Copyright © 2018. All Rights Reserved.